భార్య స్థానంలో భర్త విధులు... ఏపీలో ఓ గవర్నమెంట్ స్కూల్ నిర్వాకమిదీ...
పామర్రు : భార్యలు పదవిలో వుంటే భర్తలు పెత్తనం చేయడం మనం రాజకీయాల్లో చూస్తుంటాం...
పామర్రు : భార్యలు పదవిలో వుంటే భర్తలు పెత్తనం చేయడం మనం రాజకీయాల్లో చూస్తుంటాం... ఈ జబ్బు ప్రభుత్వ ఉద్యోగులకూ పాకినట్లుంది. ప్రభత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న భార్య స్థానంలో భర్త విధులకు హాజరైన సంఘటన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వెలుగుచూసింది. ఇలా భార్య స్థానంలో విధులకు హాజరవడమే కాదు ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులను దబాయించాడు సదరు నకిలీ టీచర్.
తొట్లవల్లూరు మండలం పెనమకుర్రు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ గర్భవతిగా వుండటంతో విధులకు హాజరుకాలేదు. దీంతో ఆమె స్థానంలో భర్త విధులకు హాజరై రెగ్యులర్ టీచర్ మాదిరిగానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవో అనుమతితోనే అతడు విధుులకు హాజరయ్యాడని సిబ్బంది చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.