ఆలయంలో కత్తితో యువకుడి హల్‌చల్ .. చచ్చిపోతానంటూ బెదిరింపు..
విశాఖలో ఓ యువకుడు చేతిలో కత్తితో హల్‌చల్ చేశాడు.
విశాఖలో ఓ యువకుడు చేతిలో కత్తితో హల్‌చల్ చేశాడు. అక్కయ్యపాలెం షిర్డీసాయి ఆలయంలో కత్తి పట్టుకుని చచ్చిపోతానని అనిల్ అనే యువకుడు బెదిరింపులకు దిగాడు. మూడు కిలోమీటర్ల మేర పోలీసులను ముప్పతిప్పలు పెట్టించాడు. తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. కత్తితో పొడుచుకుంటానని పోలీసులకు చెప్పాడు. అనంతరం తనను హరే రామ హరే క్రిష్ణ టెంపుల్‌కు తీసుకు వెళ్లాలని అనిల్ పోలీసులను కోరాడు. దీంతో పోలీసుల ద్విచక్ర వాహనంలో తీసుకువెళతామని చెప్పి.. చాకచక్యంగా అనిల్‌ని అదుపులోకి తీసుకుని.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అనిల్‌కు మతిస్థిమితం సరిగా లేదని బంధువులు చెబుతున్నారు.