మున్నేరులోకి నడుచుకుంటూ వెళ్లి వ్యక్తి ఆత్మహత్య

మున్నేరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరదలకు నిండుగా పొంగిపొర్లుతున్న మున్నేరులోకి నడుచుకుంటూ వెళ్లి, కొట్టుకుపోయాడు.

First Published Jul 26, 2022, 2:22 PM IST | Last Updated Jul 26, 2022, 2:22 PM IST

మున్నేరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరదలకు నిండుగా పొంగిపొర్లుతున్న మున్నేరులోకి నడుచుకుంటూ వెళ్లి, కొట్టుకుపోయాడు.ఎన్టీఆర్ జిల్లా : NTR జిల్లా, జగ్గయ్యపేట,పెనుగంచిప్రోలు గ్రామంలోని మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహంలోకి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అతడు నడుచుకుంటూ వెళ్లినట్లు చూసిన స్థానికులు సమాచారం అందించారు. నడుచుకుంటూ వెడుతూ వరద ప్రవాహానికి కొట్టకు పోయినట్లు సమాచారం. విషయం తెలిసి కుటుంబ సభ్యులు బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. మున్నేరు ఒడ్డున ఆ వ్యక్తి చెప్పులు, ఫోను ను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ వ్యక్తిని పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన నల్లబోతుల. కోటయ్యగా( 35) గుర్తించారు. అతనికి  భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు మున్నేరులో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.