కరోనా కష్టాలు : తోడబుట్టిన అన్న చనిపోతే కనికరించని తమ్ముడు.. ఊరి బయటే శవం..

అవనిగడ్డ మోపిదేవి మండలంలోని మోపిదేవిలంక గ్రామానికి చెందిన కారుమూరి చైనా వెంకటేశ్వరరావు పొట్టకూటికోసం పెదపులిపాకకు వలసవెళ్లాడు.

First Published Apr 23, 2020, 1:37 PM IST | Last Updated Apr 23, 2020, 1:37 PM IST

అవనిగడ్డ మోపిదేవి మండలంలోని మోపిదేవిలంక గ్రామానికి చెందిన కారుమూరి చైనా వెంకటేశ్వరరావు పొట్టకూటికోసం పెదపులిపాకకు వలసవెళ్లాడు. అక్కడే ఉరేసుకున్నాడు. విజయవాడలో ఆస్పత్రికి తరలిస్తే చనిపోయాడని చెప్పి అర్థరాత్రి అంబులెన్స్ లో మోపిదేవిలంకకు తీసుకువచ్చారు. గ్రామంలో ఉన్న తమ్ముడు తన ఇంటికి తీసుకువెళ్లడానికి నిరాకరించాడు. దీంతో గ్రామం బయట రోడ్డుపక్కన దింపేసి వెళ్లిపోయారు.  కరోనా టైంలో ఎక్కడో  మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి మా గ్రామానికి ఎందుకు తీసుకుని వచ్చారంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మృతుని బంధువులకు నచ్చచెప్పి ఇక్కడే ఖననం చేయాలా లేక విజయవాడకు తిరిగి పంపించాలా అని పోలీసులు తల పట్టుకుని కూర్చున్నారు.