గుడివాడలో విషాదం: చేపల చెరువు వ్యాపారంలో మోసపోయి ఆత్మహత్య

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. 

First Published Dec 30, 2020, 11:54 AM IST | Last Updated Dec 30, 2020, 11:54 AM IST

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రాజేంద్ర నగర్ కాలనీలో ఓ వ్యక్తి పురుగుల మందుసేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు చింతపల్లి ఉమప్రసాద్(43)గా గుర్తించారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.మృతుడు ఉమప్రసాద్ ది పామర్రు మండలం కొండయ్య పాలెంగా తెలుస్తోంది. చేపల చెరువు వ్యాపారంలో తనను మోసం చేసారంటూ కొంతమంది పేర్లతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మోసం చేసిన విషయంపై గతంలో నందివాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.