వివాహేతర సంబంధమేనా? ... కృష్ణా జిల్లాలో యువకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామంలో బచ్చు శ్రీనివాస్(33) అనే యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు.
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామంలో బచ్చు శ్రీనివాస్(33) అనే యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండుగులు శ్రీనివాస్ ను హత్యచేసారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై వుంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
గ్రామస్తులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు అవనిగడ్డ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.