Asianet News TeluguAsianet News Telugu

నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని ప్రత్యర్థి ఎంత కిరాతకంగా నరికాడో చూడండి...


విజయవాడ: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థి అతి కిరాతకంగా కత్తితో నరికి చంపడానికి యత్నించాడు.  


విజయవాడ: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థి అతి కిరాతకంగా కత్తితో నరికి చంపడానికి యత్నించాడు.  ఈ ఘోర సంఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురులో చోటుచేసుకుంది. షేక్ షారు అనే వ్యక్తిని నడిరోడ్డుపై అడ్డుకున్న అబ్దుల్ షరీఫ్ తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసాడు. దీంతో షారు రక్తపుమడుగులో పడిపోగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో పడివున్న షారును పోలీసులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.