మచిలీపట్నంలో నాలుగో పాజిటివ్ కేసు.. కానిస్టేబుల్ కి కరోనా..

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో 4వ కరోనా పాజిటీవ్ కేసు నమోదయ్యిందని ఆర్డీఓ ఖాజావలీ తెలిపారు. 

First Published Apr 27, 2020, 4:48 PM IST | Last Updated Apr 27, 2020, 4:48 PM IST

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో 4వ కరోనా పాజిటీవ్ కేసు నమోదయ్యిందని ఆర్డీఓ ఖాజావలీ తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వ్యక్తి సుకర్లాబాద్ కు చెందిన కానిస్టేబుల్ అని, విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో విధులునిర్వహిస్తున్నాడని తెలిపారు. విజయవాడలో అనుమానిత పోలీసులకు పరీక్షలు జరపగా సుకర్లాబాద్ వాసికి నిర్ధారణ అయ్యిందని, ఇతనితో పాటు అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపారు. పాజిటివ్ రావటంతో బాధితుడిని విజయవాడకు, కుటుంబ సభ్యులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కు తరలించారు. ఇప్పటికే చిలకలపూడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటీవ్ రాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన విషయంతెలిసిందే.