Visakhapatnam Accident:ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్ బోల్తా

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో ఆందోళన నెలకొంది. బోల్తాపడిన ట్యాంకర్ లోంచి గ్యాస్ లీకయి ప్రమాదం సంబవించే అవకాశాలుండటంతో స్థానికులు, పరిసర కర్మాగారాల యాజమాన్యాలు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.పరవాడలో ఎల్పీజీ లోడ్‌ తో వెళుతున్న ట్యాంకర్‌ ఎల్పీజీ బాట్లింగ్‌ కంపనీ వద్దే ప్రమాదానికి గురయ్యింది. దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు..వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి వచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.

First Published Dec 27, 2021, 1:13 PM IST | Last Updated Dec 27, 2021, 1:13 PM IST