మచిలీపట్నంలో ఉద్రిక్తత... చర్చి ప్రాంగణంలోని మేరీమాత విగ్రహం ధ్వంసం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే మేరీమాత విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. ఎస్పీ కార్యాలయం పక్కనే గల చర్చిలో ఇలా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా విగ్రహం ధ్వంసం ఘటన మచిలీపట్నంలో ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహధ్వంసం గురించి తెలుసుకుని భారీగా క్రైస్తవులు చర్చి వద్దకు చేరుకుంటున్నారు. పోలీసులు కూడా మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. చర్చిలోని సిసి కెమెరాలు పనిచేస్తుండకపోవడంతో దగ్గర్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే డాగ్ స్వాడ్ సహాయంతో నిందితలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.