Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి ప్రధానిని ప్రత్యేక హోదా అడగండి.. లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు


విశాఖ పట్నం : రాయలసీమ, ఉత్తరాంధ్రల  జిల్లాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక హోదా సాధించాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు.  

First Published Nov 5, 2022, 2:40 PM IST | Last Updated Nov 5, 2022, 2:40 PM IST

              
విశాఖ పట్నం : రాయలసీమ, ఉత్తరాంధ్రల  జిల్లాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక హోదా సాధించాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు.  శనివారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రత్యేక హోదా పొందడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్రం నుండి మన నాయకులు హోదా సాధించ గలిగితే పరిశ్రమలు వెల్లువలా వస్తాయని, దీనితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా యువతకి ఉపాధి లభిస్తుందన్నారు. కాబట్టి ఆంద్రప్రదేశ్ లోని అధికార,ప్రతిపక్ష పార్టీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే వేదికపై కి తీసుకువచ్చి ఈ నెల 11 న విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేయాలని ఆయన కోరారు.