Asianet News TeluguAsianet News Telugu

లగేజ్ ఆటో యూనియన్ దాతృత్వం... నెల రోజులుగా ఉపాధి లేకున్నా..

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని విజయదుర్గా లగేజీ ఆటో యూనియన్, అఖిలా డ్రైవింగ్ స్కూల్  కరోనా నేపథ్యం లో స్వచ్చందంగా వచ్చి పోలీస్ వారికి తమ వంతుగా సాయం చేస్తున్నారు. 

First Published Apr 28, 2020, 3:38 PM IST | Last Updated Apr 28, 2020, 3:38 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని విజయదుర్గా లగేజీ ఆటో యూనియన్, అఖిలా డ్రైవింగ్ స్కూల్  కరోనా నేపథ్యం లో స్వచ్చందంగా వచ్చి పోలీస్ వారికి తమ వంతుగా సాయం చేస్తున్నారు. వీరి తరఫున మూడు లగేజ్ ఆటోలను పోలీసువారి సేవలో ఉంచడమే కాకుండా, మూడు వాహనాలు వారే నడుపుతూ ప్రతీ గ్రామంలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుమారుగా నెల రోజుల నుంచి  వారికి ఉపాధి లేకున్నా సమాజం పై వారికి ఉన్న బాధ్యతని ఇలా చూపిస్తున్నారు. పోలీసులకు ఏంతో సహాయ సహకారం అందిస్తున్న వీరు అభినందనీయులని సర్కిల్ ఇనస్పెక్టర్ బి. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.