పంచాయితీ ఎన్నికల వేళ... భారీగా పట్టుబడుతున్న నాటుసారా
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం సీతారాంపురం శివారులో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం సీతారాంపురం శివారులో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా నిర్వహిస్తున్న సారా బట్టీలపై మెరుపు దాడి చేశారు. తెల్లవారుజామున ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. సీఐ పి.శ్రీను అధ్వర్యంలో రెడ్డిగూడెం ఎస్సై ఆనంద్ కుమార్, తన సిబ్బందితో కలిసి సీతారాంపురం శివారులోని నల్లేరుగట్టు సమీపంలో ఉన్న మామిడి తోటలో, రెండు సారా బట్టిలఫై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సీతారాంపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 60 లీటర్ల నాటు సార స్వాధీన పరచుకుని, 400 లీటర్లు బెల్లపు ఊట ధ్వంసం చేశారు. వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎక్కడా సార ఆనవాళ్లు కనపడకూడదు అని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నిరంతరం సార ఫై నిఘా పెడుతున్నారు పోలీసులు.