మూడు వేల బాటిళ్లు-నాలుగు లక్షలు... ఏపీలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం

గుంటూరు: తెలంగాణ నుండి అక్రమంగా ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 

First Published Oct 6, 2021, 4:27 PM IST | Last Updated Oct 6, 2021, 4:27 PM IST

గుంటూరు: తెలంగాణ నుండి అక్రమంగా ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ చెక్ పోస్ట్ వద్ద ఓ లారీలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న మూడు వేల నూట నలభై నాలుగు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని... వీటి విలువ నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని గురజాల డీఎస్పీ జయరాం తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం నేరమని... ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.