విజయవాడలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం
విజయవాడ: ఓవైపు కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్న నిందితున్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ: ఓవైపు కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్న నిందితున్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జంక్షన్ లోని ఓ ఇంట్లో తనీఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమమద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. తెలంగాణ నుండి అక్రమ మార్గాల ద్వారా మద్యం బాటిళ్లను ఏపీకి చేరవేస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుండి 838 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నారు.
దొంగ మార్గాల ద్వారా అక్రమ మద్యం రవాణా కు పాల్పడిన, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా మద్యం అమ్మకాలు నిర్వహించిన వారిపై చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు. ఈ అక్రమమద్యం అమ్మకాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు, ఎవరి సహాయంతో మద్యం బాటిళ్లను ఇక్కడికి తీసుకు వచ్చింది... ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నది మొదలైనవి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం బాటిళ్ల విలువ 1,24,260/-రూపాయలు ఉంటుందని తెలిపారు.