Asianet News TeluguAsianet News Telugu

మాకే లేదంటే.. వాళ్లకెలా అమ్ముతారు.. గొడవకు దిగిన మందుబాబులు

తుళ్లూరు మండలంలో నాలుగు వైన్ షాపులకు గాను రెండు షాపులలో మాత్రమే మద్యం దొరుకుతుంది. 

తుళ్లూరు మండలంలో నాలుగు వైన్ షాపులకు గాను రెండు షాపులలో మాత్రమే మద్యం దొరుకుతుంది. దీంతో తుళ్లూరు, మల్కాపురం వైన్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా  పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. మాకే లేదంటే వేరే దగ్గర్నుండి వచ్చినవాళ్లకు అమ్ముతారా అంటూ గొడవకు దిగిన మద్యం ప్రియులు.  ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి మద్యం విక్రయించడానికి వీలు లేదంటూ డిమాండ్ చేస్తున్న మధ్య ప్రియులు.