గుంటూరు జిల్లాలో చిరుతపులి భయం... ప్రజల భయాందోళన
గుంటూరు జిల్లావాసులకు చిరుత పులి భయం పట్టుకుంది.
గుంటూరు జిల్లావాసులకు చిరుత పులి భయం పట్టుకుంది. తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామానికి చెందిన ఓ అరటి రైతు తన పొలంలో చిరుతను పోలిన పాదముద్రలు గుర్తించాడు. దీంతో భయాందోళనకు గురయిన అతడు గ్రామస్తుల సాయంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్ అధికారులు నిర్దారణ తర్వాతే అవి చిరుతపులి పాదముద్రలు అవునో కాదో తేలనుంది. అయితే మెల్లెంపూడితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు బయపడిపోతున్నారు.