ఏజెంట్ల గొడవ, టిడిపి-వైసిపి శ్రేణుల వాగ్వాదం...గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత
గుంటూరు: చివరి దశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గుంటూరు: చివరి దశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ ఎస్సీ కాలనీ పోలింగ్ బూత్ లో ఏజెంట్లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు ఏజెంట్ల మధ్య మాటా మాటా పెరిగి కూర్చీతో కోట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలవగా ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుంటే అమరావతి మండలం ఉంగుటూరు ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడినుండి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.