విశాఖ పోలీసుల వేధింపులు... అపర్ణకు మద్దతుగా ఐద్వా, ఎస్ఎఫ్ఐ ధర్నా
విశాఖపట్నం: కరోనా మహమ్మారికి బయపడకుండా ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవ చేస్తున్న మెడికల్ సిబ్బందిని కూడా పోలీసులు ఇబ్బందిపెట్టడం దారుణమని ఐద్వా సభ్యులు పేర్కొన్నారు.
విశాఖపట్నం: కరోనా మహమ్మారికి బయపడకుండా ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవ చేస్తున్న మెడికల్ సిబ్బందిని కూడా పోలీసులు ఇబ్బందిపెట్టడం దారుణమని ఐద్వా సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న అపోలో ఉద్యోగిని లక్ష్మీ అపర్ణపై కక్షపూరితంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆందోళన కు దిగింది. ఈ ఆందోళన కు ఎస్ ఎఫ్ ఐ కూడా మద్దతు తెలిపింది. పోలీసులు చర్యలు దుర్మార్గమని... అపర్ణపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని ఐద్వా సభ్యులు డిమాండ్ చేశారు.