Asianet News TeluguAsianet News Telugu

బిచ్చగాడే కానీ.. బ్రాండెడ్ చొక్కాలు.. కట్టల కొద్దీ డబ్బు...

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కొండపేట మసీదు వద్ద మహబూబ్ నగర్ కు చెందిన శ్రీను అనే యాచకుడు కొన్నాళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కొండపేట మసీదు వద్ద మహబూబ్ నగర్ కు చెందిన శ్రీను అనే యాచకుడు కొన్నాళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని పరిస్థితి చూసి స్థానిక  ద్రోణాచలం సేవా సమితి సభ్యులు అతనికి స్నానం చేయిస్తున్న సమయంలో అతని ఒంటిమీదున్న 12 చొక్కల్లో.. కవర్లలో కట్టలు కట్టలుగా ఉన్న డబ్బు చూసి వారు ఆశ్చర్యపోయారు. డబ్బు మొత్తం తీసి లెక్కించగా చెల్లని  పాత 500 నోట్లు 77 వేల 500, చెల్లుబాటులో ఉన్న డబ్బు ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి సేవా సమితి సభ్యులు తీసుకెళ్లగా మొత్తం డబ్బు అతని కుటుంబ సభ్యులకు గుర్తించి వారికి అందజేస్తామని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సురేష్ తెలియజేశారు.