Asianet News TeluguAsianet News Telugu

లేడీ సింగం... గంజాయి సేవిస్తున్న వారిని వెంబడించి పట్టుకున్న ఎస్సై

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు మచిలీపట్నంలో కూడా గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు మచిలీపట్నంలో కూడా గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంలో జగన్నాథపురంలో జోరుగా గంజాయి సేవనం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో నిఘా పెంచిన పోలీసులు గంజాయి సేవిస్తున్న విద్యార్ధులను పట్టుకున్నారు. జగన్నాథపురం రైసుమిల్లు వెనకాల ఖాళీ స్థలంలో  విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ..   ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసారు. పోలీసులను చూసి విద్యార్థులు పారిపోతుండగా లేడీ సింగం ఎస్సై అనూష ఒకర్ని వెంబడించి పట్టుకొని ఇతరుల ఆచూకీని కూడా కనుక్కున్నారు. 

Video Top Stories