సచివాలయ ఉద్యోగిపై రాళ్లదాడి...మహిళా కానిస్టేబుల్ కుటుంబం నిర్వాకం

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెద్దఎరికిపాడు గ్రామానికి చెందిన కొత్తూరు విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్  రమాదేవి కుటుంబం రాళ్ళ దాడికి పాల్పడింది.

First Published Jan 12, 2021, 1:13 PM IST | Last Updated Jan 12, 2021, 1:13 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెద్దఎరికిపాడు గ్రామానికి చెందిన కొత్తూరు విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్  రమాదేవి కుటుంబం రాళ్ళ దాడికి పాల్పడింది. గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయ కుమార్ కు కానిస్టేబుల్ రమాదేవి కుటుంబానికి సరిహద్దు గొడవలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గొడవ జరగగా విజయ కుమార్ పై కానిస్టేబుల్ కుటుంబం రాళ్ళ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన విజయ్ ను స్థానికులు గుడివాడ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.