అడ్డుగోలుగా స్కాం చేశాడు కనకే.. జైల్లో పడే పరిస్థితి వచ్చింది.. గుమ్మనూరు జయరామ్

మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అందుకే అరెస్ట్ అయ్యాడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. 

First Published Jun 12, 2020, 5:07 PM IST | Last Updated Jun 12, 2020, 5:07 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అందుకే అరెస్ట్ అయ్యాడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. దానివల్లే ఆయనపై మా ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుందన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేనిపోనీ ఆరోపణలు చేయడం సిగ్గు చేటని గత ప్రభుత్వ హయాంలో ఆయా రంగాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ..కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోలేదు...అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రి గా పనిచేసే సమయంలో మందుల కొనుగోలలో దాదాపు 150 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి...అవినీతి ఆరోపణలను మా ప్రభుత్వం బయట పెడితే  టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.