Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ నందిగం సురేష్ స్టేషన్ కు వచ్చిందీ... ఎస్సైతో వాగ్వాదం నిజమే..: కృష్ణలంక ఎస్సై

విజయవాడ: వైసిపి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడిచేసారంటూ జరుగుతున్న ప్రచారంపై కృష్ణలంక ఎస్సై సత్యానందం స్పందించారు. 

విజయవాడ: వైసిపి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడిచేసారంటూ జరుగుతున్న ప్రచారంపై కృష్ణలంక ఎస్సై సత్యానందం స్పందించారు. గత అర్ధరాత్రి మద్యం సేవించి త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాట వాస్తవమేనని...ఈ సందర్భంగా స్టేషన్ ఎస్పై తో కొంత వాగ్వాదం జరిగిందన్నారు. కానీ స్టేషన్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు... ఎస్సైపై దౌర్జన్యం చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కేసు నమోదు చేసిన యువకులకు సంబంధించి మాట్లాడేందుకు మాత్రమే నందిగం సురేష్ స్టేషన్ కి వచ్చారని ఎస్సై వివరణ ఇచ్చారు.