నేను మూర్ఖుడిని.. పనిపాటా లేని వాడిని.. సెల్ఫీ వీడియో.. ఎక్కడంటే..
కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతున్నా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్ల పైకి వచ్చే వారికి వినూత్న శిక్ష వేస్తున్నారు గుంటూరు రూరల్, కొల్లూరు ఎస్ ఐ.
కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతున్నా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్ల పైకి వచ్చే వారికి వినూత్న శిక్ష వేస్తున్నారు గుంటూరు రూరల్, కొల్లూరు ఎస్ ఐ. నేను మూర్ఖుడిని, నేను మాస్క్ పెట్టుకోను, పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను అంటూ ఓ బోర్డు తయారు చేయించారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారితో తమ ఫోన్ లో సెల్ఫీ తీపించి వాట్స్ యాప్ డిపి గా, తమ సొంత సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేపిస్తూ వినూత్నంగా శిక్ష వేస్తున్నారు.