పేర్ని నాని ఒత్తిడితోనే నాపై అక్రమ కేసు..: కొల్లు రవీంద్ర సీరియస్

విజయవాడ: పంచాయితీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 

First Published Feb 9, 2021, 2:28 PM IST | Last Updated Feb 9, 2021, 2:28 PM IST

విజయవాడ: పంచాయితీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం తనపై నమోదయిన కేసు గురించి స్పందిస్తూ... మంత్రి పేర్ని నాని ఒత్తిడితోనే పోలీసులు తనపై కేసు పెట్టారన్నారు. మ‌చిలీప‌ట్నంలో ఎప్పుడు లేని సంస్కృతికి మంత్రి పేర్ని నాని శ్రీ‌కారం చుట్టారన్నారు. పొట్లపాలెంలో టీడీపీ అభ్య‌ర్థిని దాచార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే మాపైనే అక్ర‌మ కేసులు పెట్టారన్నారు. వైసిపి అభ్య‌ర్థి ఇంటిపై దౌర్జ‌న్యం చేస్తే పోలీసులు చూస్తు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.రాత్రికి రాత్రే నేను తాము దాడికి వెళ్లామని... వైసీపీ అనుచ‌రులపై దాడి చేసార‌ని క‌ల్పించి తనపై కేసుల నమోదు చేశారన్నారు. మ‌చిలీప‌ట్నంలో పెద‌సింగు లక్ష్మణరావు, అంబ‌టి బ్రాహ్మ‌ణ‌య్య‌,  , న‌డ‌కూదిటి న‌ర‌సింహారావు, నేను ఇలా ఇంత‌ మంది ఎమ్మెల్యేగా ప‌నిచేసిన‌ప్పుడు ఎవ‌రు ఇలాంటి చ‌ర్య‌లు, సంస్కృతి లేదని రవీంద్ర మండిపడ్డారు.