Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్ రెడీ... అందుకే ఫాంహౌస్..: కొడాలి నాని సంచలనం

తాడేపల్లి: వెయ్యి జన్మలెత్తినా క్యారెక్టర్ విషయంలో జగన్ చిటికెన వేలును కూడా చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తాకలేరని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మండిపడ్డారు.

First Published Jun 19, 2021, 3:47 PM IST | Last Updated Jun 19, 2021, 3:47 PM IST


తాడేపల్లి: వెయ్యి జన్మలెత్తినా క్యారెక్టర్ విషయంలో జగన్ చిటికెన వేలును కూడా చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తాకలేరని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మండిపడ్డారు. - తనకు వెన్నుపోటు పొడుస్తావనే బాబు నిన్ను ఫాం హౌస్ లో పెట్టింది వాస్తవం కాదా లోకేష్..? అని లోకేష్ ని ప్రశ్నించారు. జగన్ క్రెడిబులిటీ తో రాజకీయాలు చేస్తుంటే... అడుక్కుతిని అయినా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు లక్ష్యమన్నారు. 

''లోకేష్ కు ఇంట్లో తిండి పెట్టడం లేదు.. ఆ ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి వాగుడు వాగుతున్నాడు.  జగన్ దమ్ము ఏంటో బాబు చూశాడు... మీరు సింహాలు కాదు.. వీధి కుక్కలు. తుప్పు చిటికేసినా.. పప్పు తప్పెట్లు కొట్టినా జగన్ చిటికెన వేలు కూడా కదిలించలేరు. జగన్ చిటికె వేయాల్సిన అవసరం లేదు... నోటికొచ్చినట్లు మాట్లాడితే వైఎస్సాసిపి అభిమానులే బడిత పూజ చేస్తారు'' అని మంత్రి నాని హెచ్చరించారు.