చిత్తూరు: ''వామ్మో... ఇన్ని జిలేబీలు, వడలు ఎవరి కోసం స్వామీ.!''
అమరావతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటినగరంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రసాదం విషయంలో సిబ్బందికి ఘర్షణ చోటుచేసుకుంది. ఆలయం నుండి పెద్ద పెద్ద కవర్లలో జిలేబీలు, వడలు కవర్లలో తీసుకెళ్తున్న ఇన్స్‌పెక్టర్‌ను సెక్యూరిటీ గార్డు నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్వామివారి ప్రసాదాలు బయటకు తీసుకెళ్లేది ఎందుకోససమో చెప్పాలంటూ సెక్యూరిటీ గార్డు నిలదీశాడు.పేదలకు ఇవ్వాల్సిన ప్రసాదాలను బయట అమ్ముకుంటున్నారంటూ ఆలయ సిబ్బందిపై గార్డు గరం అయ్యారు. తనకు తెలియకుండా టెంపుల్ నుంచి ఏ వస్తువును బయటకు పోనివ్వబోనని సెక్యూరిటీ గార్డు సిబ్బందికి హెచ్చరించారు. అయితే సెక్యూరిటీ గార్డు తనపై దాడి చేశాడని టెంపుల్ ఇన్స్‌పెక్టర్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.