గన్నవరం విమానాశ్రయం వద్ద కార్తికేయ2 మూవీ బృందం సందడి

విజయవాడ : యువ హీరో నిఖిల్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ2 మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published Aug 10, 2022, 10:19 AM IST | Last Updated Aug 10, 2022, 11:00 AM IST

విజయవాడ : యువ హీరో నిఖిల్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ2 మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదల సందర్భంగా మూవీ యూనిట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ప్రమోషన్స్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడలో మూవీ యూనిట్ సందడి చేసింది.విశాఖపట్నంలో కార్యక్రమాలు ముగించుకుని విజయవాడకు చేరుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న హీరో నిఖిల్క, హీరోయిన అనుపమ పరమేశ్వరన్, నటుడు వైవా హర్షకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అభిమానుల సందడం మధ్య విమానాశ్రయం నుండి రోడ్డుమార్గంలో విజయవాడకు బయలుదేరిన కార్తికేయ2 సినిమా బృందం నేరుగా పివిపి మాల్ కు చేరుకున్నారు. అక్కడ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మూవీ యూనిట్ పాల్గొంది.