Asianet News TeluguAsianet News Telugu

కార్తీక దీపాల వెలుగులో మెరిసిపోయిన విజయవాడ దుర్గమ్మ ఆలయం...

 విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దీపాల వెలుగులో  మెరిసిపోయింది.

First Published Nov 8, 2022, 1:45 PM IST | Last Updated Nov 8, 2022, 1:45 PM IST

 విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దీపాల వెలుగులో  మెరిసిపోయింది. సూర్యోదయానికి ముందుగానే ఆలయానికి భారీగా భక్తులు చేరుకుని దీపాలను వెలిగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అఖండ దీపం వెలిగించి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   
భక్తులు వెలిగించిన దీపాల కాంతిలో దుర్గమ్ము గుడి దేదీప్యమానంగా వెలుగొందింది. 

ఇక కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో శివాలయాలు కూడా కార్తీక దీపాలతో వెలిగిపోయాయి. ముఖ్యంగా కృష్ణా నది ఒడ్డున గల శివాలయాలకు తెల్లవారుజామునే భక్తులు భారీగా చేరుకుని దీపాలను వెలిగించారు. జ్వాల తోరణాలను కూడా వెలిగించిన భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. చంద్రగ్రహణం నేపథ్యంలో దీపారాదన అనంతరం ప్రముఖ దేవాలయాలన్ని మూతపడ్డాయి. ఇలా ఇంద్రకీలాద్రిపై దేవాలయాలన్నింటిని అధికారులు, అర్చకులు మూసివేసారు.