వెంకాయమ్మ కొడుకు నా కూతురితో అసభ్య ప్రవర్తన...: కంతేరు గొడవపై సునీత వివరణ
గుంటూరు: తాడికొండ మండలం కంతేరులో దళిత మహిళ వెంకాయమ్మపై దాడి జరిగిందంటూ టిడిపి ఆందోళనకు దిగడాన్ని అదే గ్రామానికి చెందిన నల్లపు సునీత తప్పుబట్టారు.
గుంటూరు: తాడికొండ మండలం కంతేరులో దళిత మహిళ వెంకాయమ్మపై దాడి జరిగిందంటూ టిడిపి ఆందోళనకు దిగడాన్ని అదే గ్రామానికి చెందిన నల్లపు సునీత తప్పుబట్టారు. రెండు కుటుంబాల మధ్య గొడవను టిడిపి పార్టీల మధ్య గొడవగా ప్రచారం చేసి రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. కర్లపూడి వెంకాయమ్మ కొడుకు కర్లపూడి వంశీ తన కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని... దీంతో అతడి కుటుంబంతో తాము గొడవపడినట్లు సునీత వివరించారు. ఈ గొడవకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయాలు చేయకుండా తన కుటుంబానికి న్యాయం చేయాలని సునీత కోరారు. తనకు. తన కూతురికి ప్రాణహాని వుందని... రక్షణ కల్పించాలని సునీత ఆవేదన వ్యక్తం చేసారు.