Kanna Comments : పరిపాలన వికేంద్రికరణ పిచ్చిఆలోచన..
రాజధాని రైతుల నిరసనకు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మద్దతు తెలిపారు.
రాజధాని రైతుల నిరసనకు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని గాలికి వదిలేసిందని, తిరుగు లేని మెజార్టీ ఇచ్చిన ప్రజలను పట్టించునే పరిస్థితి లేదని జగన్ ది ఒక రకమైన శాడిజం అని అన్నారు. పరిపాలన వికేంద్రికరణ పిచ్చిఆలోచన అని అది మార్చుకోవాలని హితవు పలికారు.