Asianet News TeluguAsianet News Telugu

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు ... పలువురికి గాయాలు

హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. 

First Published Apr 20, 2023, 5:05 PM IST | Last Updated Apr 20, 2023, 5:05 PM IST

హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ యాక్సిడెంట్ లో 17మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.   పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. ఇవాళ ఉదయం కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై నుండి కిందకుదిగిన బస్సు పొలాల్లోకి వెళ్ళి ఆగింది. బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.