ఎన్టీఆర్ జిల్లాలో జులాయి సినిమా స్టైల్ దొంగతనం... గోడకు కన్నం పెట్టి జువెల్లరీలో భారీ చోరీ
విజయవాడ: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమాలో బ్యాంక్ దొంగతనం సీన్ మీకు గుర్తుందా...
విజయవాడ: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమాలో బ్యాంక్ దొంగతనం సీన్ మీకు గుర్తుందా... సేమ్ అలాగే గోడ బద్దలుగొట్టి జువెల్లరీలో దొంగతనానికి పాల్పడ్డారు ఘరానా దొంగలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గత రాత్రి ఈ దొంగతనం జరిగింది. పట్టణంలో రోడ్డుపైనే వున్న గోకుల్ జువెల్లర్స్ లో దొంగతనానికి పక్కా స్కెచ్ వేసారు దొంగలు. మొదట ఈ జువెల్లర్ పక్కనే వున్న షాప్ తాళాలు పగలగొట్టి ప్రవేశించారు దుండగులు. గోడకు కన్నం చేసి అందులోంచి జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీగా బంగారు నగలు దోచుకున్నారు. ఇవాళ (మంగళవారం) జువెల్లర్స్ ను తెరవగానే గోడకు కన్నంవేసి వుండటం గమనించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాఫ్తు చేసారు. భారీ మొత్తంలో బంగారం, ఆభరణాలు అపహరణకు గురయినట్లు జువెల్లర్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.