కర్నూలు పోలీస్ స్టేషన్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన మూడు కేసులలో నిందితుడు మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ని విచారణ నిమిత్తం కడప జైలు నుండి కర్నూలు కు పోలీసులు తీసుకువచ్చారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన మూడు కేసులలో నిందితుడు మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ని విచారణ నిమిత్తం కడప జైలు నుండి కర్నూలు కు పోలీసులు తీసుకువచ్చారు. 154 బస్సుల నకిలీ ఎన్వోసీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిలు అరెస్టైన సంగతి తెలిసిందే. జిల్లాలో ఓర్వకల్లుకు చెందిన ఓ వ్యక్తి కి తప్పుడు పత్రాలతో మూడు లారీల విక్రయాలపై కర్నూలు రూరల్ పోలీసులు విచారణ చేపట్టనున్నారు.