దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు విగ్రహం తొలగింపు... ధర్నాకు దిగిన జనసేన
నూజివీడులో భారత దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టడాన్ని ఖండిస్తూ జనసేన నాయకులు ధర్నాకు దిగారు.
నూజివీడులో భారత దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టడాన్ని ఖండిస్తూ జనసేన నాయకులు ధర్నాకు దిగారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నూజివీడులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మున్సిపల్ తీర్మానంతో తొలగించడాన్ని ఆక్షేపిస్తూ సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ జనసేన నాయకులు దీక్షకు దిగారు. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా స్వాతంత్ర సమరయోధులు,ప్రముఖ నేతల విగ్రహాన్ని ఎలా తొలగిస్తారు అంటూ జనసేన నాయకులు ధ్వజమెత్తారు.