ఆంధ్ర ప్రదేశ్ లో వున్నామా కామాంధ్రప్రదేశ్ లో వున్నామా?: జనసేన మహిళా నాయకురాలి ఆవేదన
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై విశాఖపట్నం జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై విశాఖపట్నం జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతన్న లైంగిక దాడులకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్ ఆద్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని, నల్ల చొక్కాలతో జనసేన నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉషాకిరణ్ మాట్లాడుతూ... అంతర్జాతీయ మాతృ దినోత్సవం రోజున తల్లులు రోడ్లమీదకు వచ్చి నిరసన తెలియజేయాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. ఆడ పిల్లలకు అన్యాయం జరిగితే గన్ కన్నా ముందొస్తానన్న జగన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఇది రాజన్న రాజ్యమా, రావణ రాజ్యమా లేక రాక్షస పాలనా అర్థం కాని పరిస్థితి వుందన్నారు. మనం ఆంధ్ర ప్రదేశ్ లో వున్నామా లేక కామాంధ్ర ప్రదేశ్ లో వున్నామా అనుమానం కలుగుతోందన్నారు. వెంటనే ఏపీలో జరగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర మహిళా కమీషన్ స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. మహిళను రక్షించడం చేతగాని మహిళా హోంమంత్రి, డిజిపి రాజీనామా చేయాలని ఉషాకిరణ్ డిమాండ్ చేసారు.