భూకబ్జా ఆరోపణలు... చంద్రబాబు నివాసం వద్ద జనసేన నాయకుల ఆందోళన

గుంటూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో  కృష్ణా నది ఒడ్డున లింగమనేని రమేష్ కు కు చెందిన ఇంట్లో చంద్రబాబు కుటుంబం నివాసముండే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇంటిపక్కనే వున్న 8సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ గత ఏడేళ్లుగా తనను ఇబ్బందిపెడుతున్నారని జనసేన నాయకుడు  శింగంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇలా అక్రమంగా వాడుకుంటున్న స్థలాన్ని తనకు అప్పగించాలని కోరుతూ శ్రీనివాస్ రావు చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనకు దిగాడు. అతడికి జనసేన పార్టీకి చెందిన మరికొందరు నాయకులు కూడా మద్దతు తెలపడంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
First Published Mar 3, 2022, 2:18 PM IST | Last Updated Mar 3, 2022, 2:18 PM IST