జగనన్నఇల్లు - పేదలందరికి కన్నీళ్లు... మంగళగరిలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన జనసేన
అమరావతి : ''జగనన్న ఇల్లు - పేదలకు కన్నీళ్లు'' పేరిట జనసేన పార్టీ చేపట్టిన టిడ్కో ఇళ్ల పరిశీలన ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగింది.
అమరావతి : ''జగనన్న ఇల్లు - పేదలకు కన్నీళ్లు'' పేరిట జనసేన పార్టీ చేపట్టిన టిడ్కో ఇళ్ల పరిశీలన ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగింది. నపులూరు పోతురాజు చెరువు దగ్గర ఉన్న టిడ్కో గృహాలను మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇతర జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడ ప్రజలను అడిగి సమస్యలు, ప్రభుత్వం నుండి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఆదివారం మంగళగిరి పట్టణంలో టిడ్కో ఇళ్ల పరిశీలను వెళ్లిన తమను అడ్డుకున్నది లబ్దిదారులు కాదు వారి ముసుగోలో వున్న వైసిపి నాయకులని అన్నారు. జనవాణి కార్యక్రమంలో మాకు లబ్దిదారులే ఫిర్యాదులు చేసారని... దీంతో పరిశీలను వెళ్లగా నలుగురు వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారని అన్నారు. ఇలా ప్రజలపక్షాన నిలిచిన వారిని అడ్డుకోవడంపై పెట్టిన దృష్టి మౌళిక సదుపాయాల కల్పించడంలో పెట్టాలని శ్రీనివాసరావు సూచించారు.