Asianet News TeluguAsianet News Telugu

పవన్ కు అంబటి ఛాలెంజ్... ఈ వీడియోతో జనసేన స్ట్రాంగ్ కౌంటర్

పల్నాడు : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నాయకుడు కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. 

First Published Dec 20, 2022, 3:42 PM IST | Last Updated Dec 20, 2022, 3:42 PM IST

పల్నాడు : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నాయకుడు కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రభుత్వం అందించే డబ్బుల్లో ఇరిగేషన్ మంత్రి అంబటి వాటాలు తీసుకున్నట్లు ఏ ఒక్క లబ్దిదారుడితో చెప్పించినా తన మంత్రి, ఎమ్మెల్యే పదవుకులకు రాజీనామా చేస్తానన్న ఛాలెంజ్ కు జనసేన నాయకుడు రియాక్ట్ అయ్యారు. తన కొడుకు చనిపోవడంతో నిరుపేదలమని గుర్తించి ప్రభుత్వం డబ్బులిస్తే అందులో వాటా కావాలని అంబటి, ఆయన అనుచరులు అడిగారని ఓ జంట బాధతో తమ గోడు వెల్లబోసుకుంటున్న వీడియోను కొమ్మిశెట్టి భయటపెట్టాడు. తన ఛాలెంజ్ ను స్వీకరించి మంత్రి అంబటి రాజీనామా చేయాలని కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు డిమాండ్ చేసారు.