konaseema violance : విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన పాలాభిషేకం


విజయవాడ: కోనసీమ జిల్లాకు రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో భారీ అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

First Published May 26, 2022, 10:03 AM IST | Last Updated May 26, 2022, 10:03 AM IST

విజయవాడ: కోనసీమ జిల్లాకు రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో భారీ అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అలర్లకు మీరంటే మీరే అంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగిన ఆందోళనలకు ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ విజయవాడలో పాతబస్తీలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... కోనసీమలోని అల్లర్లకు అధికార వైసిపి నాయకులే కారణమన్నారు. వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన హత్య కేసు నుండి ప్రజల దృష్టి మరల్చడానికి కోనసీమలో    ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. వైసిపి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వైసిపి నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆవాకులు చవాకులు పేలితే ఆయన అభిమానులు ఎదురు తిరుగుతారు పోతిన మహేష్ హెచ్చరించారు.