జనసేన ఆవిర్భావ దినోత్సవం... భారీ బహిరంగ సభకు సర్వం సిద్దం
మంగళగిరి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఇవాళ(సోమవారం) మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు జనసేన నాయకులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం ఇప్పటికే సిద్దమయింది. జనసేనాని పవన్ కల్యాణ్ తో కటౌట్లు, హోర్డింగ్స్ తో పాటు పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటుచేసిన ప్లెక్సీలతో సభాప్రాంగణానికి వెళ్లే దారంతా నిండిపోయింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కానుంది.