Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ ను అంతమొందించేందుకు రెక్కీ..: జనసేన నేత ఆందోళన

గుంటూరు : జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు మరింత బలపడుతుండటంతో అధికార వైసిపికి ఓటమి భయం పట్టుకుందని జనసేన పార్టీ చేనేత వికాస చైర్మన్, మంగళగిరి ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

First Published Nov 4, 2022, 11:48 AM IST | Last Updated Nov 4, 2022, 11:48 AM IST

గుంటూరు : జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు మరింత బలపడుతుండటంతో అధికార వైసిపికి ఓటమి భయం పట్టుకుందని జనసేన పార్టీ చేనేత వికాస చైర్మన్, మంగళగిరి ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకోసమే పవన్ కల్యాణ్ ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. అయితే పవన్ ను తాకాలంటే ముందుగా జనసైనికుల దాటుకుని వెళ్లాలని... ఆ దమ్ముందా అంటూ హెచ్చరించారు. దమ్ముంటే తమతో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. వైసిపి ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని... అందువల్లే ప్రజాదరణ పెరుగుతున్న పవన్ పై ఆ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు మానుకొని పాలనపై దృష్టిపెట్టాలన్నారు. పవన్ కల్యాణ్ కు హాని తలపెట్టే ప్రమాదముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి ఆయనకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని శ్రీనివాసరావు పేర్కొన్నారు.