అధికారం లేకుండానే పవన్ ఇంతచేస్తే... సీఎం అయితోనో..!: జనసేన నేత శ్రీనివాసరావు
అమరావతి : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డువిస్తరణలో ఇళ్లు కూల్చివేతకు గురయిన బాధితులకు బాధితులకు జనసేన పార్టీ అండగా నిలిచింది.
అమరావతి : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డువిస్తరణలో ఇళ్లు కూల్చివేతకు గురయిన బాధితులకు బాధితులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే ఇప్పటంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు పవన్. ఇంతటితో ఆగకుండా వైసిపి ప్రభుత్వం కూల్చేసిన ఇళ్ళ యజమానులకు ఆర్థిక సాయం ప్రకటించారు. కూల్చేసిన ప్రతి ఇంటికి లక్షరూపాయల చొప్పున మొత్తం 53 ఇళ్లకు రూ.53 లక్షలు అందించాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి పని పవన్ చేసారన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేవాడు అన్నింటిని కూలుస్తుంటే ఏ అధికారం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి పవన్ ఆర్థిక సాయంతో ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. ఇప్పటికయినా రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకున్ని ముఖ్యమంత్రి చేసుకుని మంచి పరిపాలన పొందాలన్నారు. ముఖ్యమంత్రిగా వుంటేనే ప్రజలకు ఏదయినా చేస్తానని అనుకుంటూ రాజకీయాలు చేయకుండా అందరూ బాగుండాలనే పవన్ ఆలోచిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు.