Asianet News TeluguAsianet News Telugu

అందమైన రుషికొండను వైసిపి సర్కార్ గుండుకొట్టిస్తోంది..: పవన్ కల్యాణ్ ఆందోళన

విశాఖపట్నం : సముద్ర తీరంలో అందమైన కొండ... దానిపై పరుచుకున్న పచ్చటి ప్రకృతి...

First Published Nov 13, 2022, 10:34 AM IST | Last Updated Nov 13, 2022, 10:34 AM IST

విశాఖపట్నం : సముద్ర తీరంలో అందమైన కొండ... దానిపై పరుచుకున్న పచ్చటి ప్రకృతి... ఇలా అందాలతో కనువిందు చేసే మంచి టూరిస్ట్ స్పాట్ విశాఖలోని రుషికొండ. అలాంటి రుషికొండను కొందరు వైసిపి నాయకుల స్వార్థప్రయోజనాల కోసం ధ్వంసం చేయడం దారుణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రుషికొండ చుట్టూ తవ్వకాలు జరుపుతూ వైసిపి ప్రభుత్వం మెల్లిమెల్లిగా మింగేయడానికి ప్రయత్నిస్తోందని పవన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖకు వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ నిన్నంతా (శనివారం) అక్కడే వున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నాయకులతో కలిసి సముద్రతీరానికి వెళ్లిన పవన్ రుషికొండ పరిశీలనకు వెళ్లారు. అయితే పనులు జరుగుతుండటంతో కొండచుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేయగా లోపలికి వెళ్లేందుకు పవన్ ను అనుమతించలేదు.  దీంతో బయటనుండే ఓ మట్టికుప్పపైకి ఎక్కి లోపల జరుగుతున్న పనులను పరిశీలించారు. రుషికొండ చూట్టూ జరుగుతున్న కట్టడాల గురించి జివిఎంసి కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ పవన్ కు వివరించారు.