విశాఖ కలెక్టరేట్ వద్ద జనసేన ఆందోళన... పోలీసులతో తోపులాట, తీవ్ర ఉద్రిక్తత

విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలపై భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచుతూ వైసిపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనబాట పట్టాయి. ఇలా విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. విసనకర్రలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న జనసేన శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే కలెక్టరేట్ గేట్ వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కాస్సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  ఇక విద్యుత్ చార్జీల పెంపుపై విశాఖ టిడిపి కూడా ఆందోళన చేపట్టింది. విశాఖ టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా మహిళలు, టిడిపి కార్యకర్తలు జీవిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

First Published Apr 1, 2022, 1:02 PM IST | Last Updated Apr 1, 2022, 1:02 PM IST