Asianet News TeluguAsianet News Telugu

డిల్లీలో యువతి దారుణ హత్య ... నిందితున్ని ఉరితీయాలంటూ వైజాగ్ లో నిరసన

విశాఖపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాల్కర్ దారుణ హత్యకేసులో నిందితుడు అప్తాబ్ అమీన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో జనజాగరణ సమితి ఆద్వర్యంలో నిరసన చేపట్టారు.

First Published Nov 17, 2022, 3:24 PM IST | Last Updated Nov 17, 2022, 3:24 PM IST

విశాఖపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాల్కర్ దారుణ హత్యకేసులో నిందితుడు అప్తాబ్ అమీన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో జనజాగరణ సమితి ఆద్వర్యంలో నిరసన చేపట్టారు. కళ్లకు నల్లరంగు గంతలు కట్టుకుని శ్రద్ద కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొందరు యువతులు కోరారు. ప్రేమ పేరుతో శ్రద్దాను మోసంచేసి 35 ముక్కలుగా నరికేసిన కిరాతకుడు అప్తాబ్ ను వెంటనే ఉరితీయాలంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లవ్ జిహాద్ లో భాగంగానే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. ముంబైకి చెందిన అప్తాబ్ కాల్ సెంటర్ లో పనిచేసే శ్రద్దా వాకర్ ను ప్రేమపేరుతో నమ్మించాడు.  వీరిప్రేమకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇళ్లువదిలి డిల్లీకి పారిపోయారు. మోహ్రౌలీ ప్రాంతంలో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకుని పెళ్లికాకుండానే సహజీవనం చేసారు. అయితే పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని శ్రద్ద ఒత్తిడి తేవడంతో ఆమె అడ్డు తొలగించుకున్నాడు అప్తాబ్. ప్లాట్ లో వుండగా శ్రద్ద గొంతుకోసి చంపి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోసి ప్రిజ్ లో దాచి అతి కిరాతకంగా వ్యవహరించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో నిందితుడు అప్తాబ్ అరెస్టయ్యాడు.