ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు : మాజీ మంత్రి కామినేని


కైకలూరు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం బిజెపి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించాడు.

First Published Sep 5, 2022, 2:56 PM IST | Last Updated Sep 5, 2022, 2:56 PM IST


కైకలూరు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం బిజెపి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించాడు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్ దిగిపోవాలని, వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని, వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో జీవించే హక్కును కూడా కోల్పోతామని ఆయన వాపోయాడు. మంచి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాదాని ఈ సందర్భంగా తెలియజేసాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పోటీ పై  ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఏదేమైనా ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించాడు.