కేసు తేలాలంటే జగన్ మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందే.: కోడి కత్తి శ్రీను తరుఫు లాయర్ గగన సింధు
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఎన్నికల సమయంలో జరిగిన కోడి కత్తి దాడి విచారణపై విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఎన్నికల సమయంలో జరిగిన కోడి కత్తి దాడి విచారణపై విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 8కి వాయిదా వేసింది. తదుపరి విచారణ మొత్తం ఇక విశాఖ ఎన్ఐఏ కోర్టులో సాగనుంది. విజయవాడ కోర్టు నిర్ణయంపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది గగన సింధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు. అయితే ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదు... ఎక్కడైనా తమ వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు. కేసు కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని న్యాయవాది సింధు అభిప్రాయపడ్డారు.