Asianet News TeluguAsianet News Telugu

Video : చెప్పులతో కొట్టుకున్న జగన్ వీరాభిమాని..ఎందుకంటే...

జగన్ వీరాభిమాని రాజమాణిక్యం చెప్పులతో కొట్టుకున్నాడు. 

జగన్ వీరాభిమాని రాజమాణిక్యం చెప్పులతో కొట్టుకున్నాడు. నడుముకు గోనెసంచి కట్టుకుని మెడలో చెప్పులు వేసుకుని నిరసన తెలిపాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నంకు చెందిన రాజమాణిక్యం పుట్టుకతోనే దివ్యాంగుడు. చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో  వికలాంగుల పింఛను, తెల్ల రేషన్‌కార్డుకు అర్హుడినైనా తనకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతాప్ రెడ్డి చెబితేనే ఇస్తామని తహసీల్దార్‌ చెబుతున్నారని వాపోయాడు. దళితుడినైన తనను అధికారు లు పట్టించుకోవడం లేదన్నాడు.